గార్లదిన్నె మండలంలో మట్కా నిర్వాహకుడు అరెస్టు

గార్లదిన్నె మండలంలో మట్కా నిర్వాహకుడు  అరెస్టు

 జన చైతన్య న్యూస్ : గార్లదిన్నె మండలంలో మట్కా కేంద్రాలపై పోలీసు యంత్రాంగం దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కల్లూరు గ్రామానికి చెందిన డి. మస్తాన్ మట్కా నిర్వహిస్తున్నట్లు పక్క సమాచారం రావడంతో పోలీసు యంత్రాంగం దాడి చేసి పట్టుకున్నారు. అదేవిధంగా అతని వద్ద నుంచి రూ .10,250 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలియజేశారు.