సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ..
సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ..
1056 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం..
పుట్టపర్తి డిఎస్పి వాసుదేవన్ పర్యవేక్షణలో కొత్తచెరువు పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి నుండి 1056 టెట్రా కర్ణాటక ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కొత్త చెరువులో పోలీస్ స్టేషన్లో ఈరోజు సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ రాజా రమేష్ తో కలసి పుట్టపర్తి డిఎస్పి వాసుదేవన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
కొత్తచెరువు U.P.S ఇన్స్పెక్టర్ P.రాజా రమేశ్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యములో కొత్తచెరువు పోలీసు స్టేషన్ పరిధిలో కొడపగానిపల్లి క్రాస్ వద్ద కొత్తచెరువు-ధర్మవరం వెళ్ళే BT రోడ్డు పైన వద్ద మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో కర్ణాటక మందు తరలిస్తున్న, బుక్కపట్నం మండలం లింగప్పగారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరి అరెస్టు చేసి , వారి వద్ద నుండి 11 బాక్సుల JOHNS Original Choice Deluxe Whisky 90 ML Tetra Packets గా ఉన్న ఒక్కో బాక్సులో,
96 టెట్రా ప్యాకెట్లు కలిగిన మొత్తం 11 బాక్సులలో 1056-90 ML Tetra Packets తో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వీరిని విచారించగా వీరిపై గతంలో కొత్తచెరువు మరియు పుట్టపర్తి సెబ్ పోలీసు స్టేషన్ల నందు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని , వీరు విలాసాలకు అలవాటు పడి ఈ అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారని విచారణలో తెలిసింది.
అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు:-
1) V.చంద్రశేఖర్, వయస్సు 35 సం.లు, తండ్రి:- Late V.వెంగముని, N/o. D.No.10-39, లింగప్పగారి పల్లి గ్రామము, బుక్కపట్నం మండలము,
2) బళ్ళారి శివయ్య, వయస్సు 38 సం.లు, తండ్రి:- లేట్ చెన్నకేశవులు, N/o. D.No.2-6, లింగప్పగారి పల్లి గ్రామము, బుక్కపట్నం మండలము,
ఈ సంధర్భంగా పుట్టపర్తి D.S.P శ్రీ R.వాసుదేవన్ ప్రజలను ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని డీఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.