విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు మృతికి పరిహారం

విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు మృతికి పరిహారం

విద్యుదాఘాతంతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో పరిహారం

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కుఅందజేతప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తెనాలిలో ప్రాణాలు కోల్పోయిన గిరిపురంకు చెందిన చిరుగురి కిరణ్ కుమార్ (24) కుటుంబానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పరిహారం మంజూరైంది. యువకుడి కుటుంబ దయనీయ పరిస్థితిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో.. రూ. 4 లక్షల విలువైన చెక్కు మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మృతుని కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ప్రమాదాలు, విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను మానవీయ కోణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంటోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. నందమూరి నగర్ కు చెందిన చుండూరు వెంకటేశ్వరరావు(44) ఇటీవల రామవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేసినట్లు చెప్పారు. సూర్యలంక బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి చనిపోయిన ఆరుగురు యువకుల కుటుంబాలకు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున రూ. 18 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. 58వ డివిజన్ కు చెందిన తోట పవన్ కళ్యాణ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు మద్రాస్ నగరంలో సముద్రంలో మునిగి చనిపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిక సాయం కుటుంబానికి అందేలా చూడటం జరిగిందన్నారు. అలాగే విధులు నిర్వహిస్తూ ఎలక్ట్రిక్ షాక్ కు గురై మృతి చెందిన పఠాన్ అయూబ్ ఖాన్, మద్దాలి సాయి లోకేష్ కుటుంబాలకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆఫ్ ఏపీసీపీడీసీఎల్ తో మాట్లాడి రూ. 5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయించినట్లు తెలియజేశారు. పేదలు, అభాగ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు.