22 వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలి

22 వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలి

22 వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలి

 జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె ఎస్ షానావాజ్  ఆదేశాల మేరకు కదిరి మున్సిపాలిటీలోని 22వ వార్డులో గల త్రాగునీటి సమస్య పట్ల ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కదిరప్ప, మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షుడు అల్లాబకాష్, మైనారిటీ నాయకులు జైనుల్లా లు మాట్లాడుతూ జోక్పాళ్యం వీధి, గన్నుమియా వీధి, తిప్పుసుల్తాన్ వీధిలో గల మున్సిపల్ కుళాయిలలో మంచి నీరు సరిగా సప్లై చేయడం లేదని పది రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయని అదేవిధంగా టిప్పు సుల్తాన్ వీధిలొ గల ఉప్పు నీరు వచ్చేటువంటి కులాయి వాల్వు కూడా చెడిపోయిందని ఈ విషయాన్ని దాదాపు మూడు సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని గత ప్రభుత్వం తీర్చలేనటువంటి ఈ యొక్క సమస్యను కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కనీసం రెండు రోజులకు ఒకసారి అయిన వచ్చేటట్లు చేయాలని, వాల్వ్ సమస్యను కూడా వెంటనే తీర్చాలని కదిరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కదిరప్ప, మైనార్టీ ప్రెసిడెంట్ అల్లాబకాష్, మైనారిటీ నాయకులు జైనుల్లా, జబీబుల్లా, ఎన్ ఎస్ యు ఐ ఉపేంద్ర, షబ్బీర్, నాగేంద్ర, రవి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.