ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కైలే అనిల్ కుమార్
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ
పామర్రు టౌన్, శాసనసభ్యులు కార్యాలయం నుండి ర్యాలీ లో పాల్గొని అనంతరం యలకుర్రు,కొరిమెర్ల,ప్రాకర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గడప గడపకూ వెళ్లి ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి వారి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని కోరాను...అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సింహాద్రి చంద్రశేఖర్ గారు ఫ్యాన్ గుర్తుపై వేసి పార్లమెంట్ సభ్యుడుగా తనను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీని వల్ల లంచాలకు తావు లేకుండా.. గంటల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది. కానీ పెత్తందార్లు పక్షాన నిలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రెండు వ్యవస్థలను రద్దు చేస్తారని తెలియజేస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ అండగా ఉండే నేను భవిష్యత్తులోనూ మరింత అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మీరంతా నాకు అండగా నిలబడాలని కోరిన పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ప్రజలను కోరారు.