వివిధ పంటల సాగు గురించి రైతులకు శిక్షణ :-
వివిధ పంటల సాగు గురించి రైతులకు శిక్షణ :-
అమడగూరు (జనచైతన్య న్యూస్)జూన్ :-మండల పరిధిలోని మహమ్మాదాబాద్ రైతు భరోసా కేంద్రంలో డి.ఆర్.సి, ఏ.డి.ఏ సన్నావుల్లా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, వేరుశెనగ, సజ్జ, కంది, మొక్కజొన్న, మొదలగు వివిధ పంటలకు విత్తనం శుద్ధి నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చన్నారు,వివిధ పంటలలో తెగుళ్లు, పురుగులను ఏ విదంగా నివరించాలో సస్య రక్షణ గురించి, నీటి యాజమాన్యం గురించి వివరించారు, అలాగే నానో, యూరియా, డి.ఏ.పి వలన పంటలకు కలిగే ఉపయోగాలు, డ్రోన్ ద్వారా పంటలకు మందులను స్ప్రై చేయడం వలన పంట సాగు, ఖర్చును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రమణాచారి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కందుకూరి కృష్ణమూర్తి,రాజరెడ్డి, నాగేంద్రకుమార్ రెడ్డి, సిద్దప్ప, కమ్మల భాస్కర్, డా. రవికుమార్, ఈశ్వర్ రెడ్డి, దినేష్ రెడ్డి, నారాయణ స్వామి, అబ్దుల్ రవూఫ్, అక్బర్ బాషా, రమేష్,రమణా రెడ్డి,కుమ్మర రెడ్డప్ప, టి.మధుసూదన్,ప్రసాద్, శ్రీనివాసులు,రెడ్డప్ప,అంజినప్ప, జె. శ్రీనివాసులు, బైరిశెట్టి, ప్రజా ప్రతినిధులు రైతులు, రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.