సిపిఐ మండల నాయకుడు కామ్రేడ్ ఏ పెద్ద కొండయ్య ఆకస్మికంగా మరణించడం బాధాకరం
(సిపిఐ మండల నాయకుడు కామ్రేడ్ ఏ.పెద్ద కొండయ్య ఆకస్మికంగా మరణించడం బాధాకరం) పుట్లూరు మండలంలోని అరకట వేముల గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల నాయకుడు ఏ. పెద్దకొండయ్య మరణించడం చాలా బాధాకరమని సిపిఐ నాయకులు అన్నారు.అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఏ.పెద్ద కొండయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సిపిఐ మండల సమితిగా తెలియజేస్తున్నమన్నారు.అంతేకాకుండా కామ్రేడ్ పెద్దకొండయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సిపిఐ పార్టీ మండల కార్యదర్శి డి. పెద్దయ్య, తాడిపత్రి టౌన్ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు,డిహెచ్ పి ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శి,ఏ. రమేష్,పెద్దన్న,శాఖ కార్యదర్శి ఓబులపతి, శివ,దవీద్, బాల కొండయ్య, సూరి, వీర,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.