గూగూడు కుళ్లాయి స్వామి మొహరం వేడుకల సందర్భంగా దర్శించుకోవడానికి వేలాది, లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు
గూగూడు కుళ్లాయి స్వామి మొహరం వేడుకల సందర్భంగా దర్శించుకోవడానికి వేలాది, లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు
జనచేతన న్యూస్- నార్పల
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం లో గూగూడు గ్రామంలో వెలిసిన గూగూడు కుళ్లాయి స్వామి మొహరం వేడుకల సందర్భంగా దర్శించుకోవడానికి వేలాది, లక్షలాది మంది భక్తులు ఇక్కడ ప్రతిగా ఉండడం జరుగుతుంది.
ఇక్కడ ప్రత్యేకత శ్రీ ఆంజనేయస్వామి దర్శనం అనంతరం ఇక్కడ గూగూడు కుళ్లాయి స్వామి పీర్లని దర్శించుకోవడం ఇక్కడ భక్తుల ఆనవాయితీ వర్షం పడుతున్న లెక్కచేయకుండా దర్శనం కోసం క్యూ పద్ధతి పాటిస్తూ భక్తులు వర్షంలోనే నిల్చున్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారి శోభారాణి మాట్లాడుతూ భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు సత్య సాయి బాబా త్రాగునీరు సౌకర్యము భక్తులు స్నానం చేయుటకు రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే తల లీలాలకు ఒక రూమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే భక్తులకు 600 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసినట్లు తెలిపారు.