ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి కే ఎస్ షాన్ వాజ్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి కే ఎస్ షాన్ వాజ్

ఈరోజు అనగా తేదీ 16-04-2024 న *కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే ఎస్ షాన్ వాజ్  గారి ప్రచారంలో భాగంగా తలుపుల మండలంలో బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ* కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరించి ఇప్పుడు ఉన్న ఉపాధి హామీ కూలిని కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే 400 రూపాయలు చేస్తుందని హామీ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ పేదలకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మరియు ప్రతి ఇంటికి 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పేదలకు మేలు చేసే పథకాలను ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు.

ఇవన్నీ అమలు అవ్వాలి అంటే మీ అందరూ కలిపి మే నెల 13వ తేదీన మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో కేంద్రంలో గెలిపించి మరల ఆనాటి స్వర్ణ యుగాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదర్ నాగ భూషణం, ఆశ్రప్, బాబా, అరిప్, నాగేందర్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.