పెద్దపప్పూరు లో ఘనంగా రెవెన్యూ దినోత్సవం జరుపుకోవడం జరిగినది
పెద్దపప్పూరు లో ఘనంగా రెవెన్యూ దినోత్సవం జరుపుకోవడం జరిగినది
జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం లో ప్రజలు, రైతులు నిరంతర సేవలో రెవెన్యూ శాఖ పనిచేస్తుందని డిప్యూటీ తాసిల్దార్ మహబూబ్ బాషా, పెద్దపప్పూరు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలకు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉంటుందని ఇతర అన్ని శాఖలతో కలిసి రెవెన్యూ శాఖ పనిచేయాల్సి ఉంటుందని, ఎన్నికల నిర్వహణ, భూములు పంపిణీ, ఇంటి పట్టాలు పంపిణీ లాంటి కీలక పనులు కూడా రెవెన్యూ శాఖ నిర్వహిస్తుందన్నారు. కాలానుగుణంగా రెవెన్యూ శాఖలో కూడా అనేక మార్పులు జరిగాయన్నారు, అలాగే 1986లో రెవెన్యూ వ్యవస్థ వచ్చినది కానీ అందరికీ కూడా దినోత్సవాలు ఉన్నాయి, రెవెన్యూ వ్యవస్థకు ఒక రెవెన్యూ అనేది మొన్నటి వరకు లేదు. రెవెన్యూ యూనియన్ ద్వారా 1986 నుండి మొన్నటి వరకు మా రెవెన్యూ వ్యవస్థకు కూడా రెవెన్యూ దినోత్సవం కావాలని మా యూనియన్ 1986 నుండి మొన్నటి వరకు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక జీవో తెచ్చి రెవెన్యూ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరపాలని ప్రతి సంవత్సరం 20 జూన్ 2024 జరపాలని ప్రభుత్వం కేటాయించడం మా రెవెన్యూ వ్యవస్థకు చాలా సంతోషమని తెలియజేస్తున్నాను. మేము రైతులకు ప్రజలకు అన్నివేళలా రెవెన్యూ తోనే ముడిపడి ఉన్నది, రెవెన్యూ వ్యవస్థ క్రియాశీలకము ప్రజలకు అందుబాటులో ఉండి వారి పనులు చక చక పనులు చేసి పంపించే రెవెన్యూ వ్యవస్థ అని రెవెన్యూ దినోత్సవం లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ రెడ్డి, నరేష్, విఆర్ఓ లు కిషోర్, కృష్ణవేణి, ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, నాగముని శివప్రసాదరావు, ఇస్మాయిల్, సుంకన్న, సిపిఐ చింతాపురుషోతం, ఆంజనేయులు, వీఆర్ఏలు బాలచంద్ర, లక్ష్మీనారాయణ, భాగ్యమ్మ, వరదమ్మ, చిన్న పకీరప్ప, తదితరులు పాల్గొన్నారు.