ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయింపు ఎన్డీయే ఘనత: బిజేపీ

ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయింపు ఎన్డీయే ఘనత: బిజేపీ

 కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి బిజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించారని,ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15000 కోట్లు,జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కి అధిక నిధుల కేటాయింపు,వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి ఈ ఏడాది నిధులు కేటాయింపు,ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ఎన్డీయే ప్రభుత్వమని,ప్రధాని నరేంద్ర మోడీకి,కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు,ఏపీ సియం చంద్రబాబు నాయుడుకి బిజేపీ సత్యసాయిజిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడులు కేశవరెడ్డి లు జిల్లా కిషన్ మోక్ష ఉపాధ్యక్షులు హరిప్రసాద్ లు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా0మంగళవారం విలేకరుల సమావేశంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన 

 బడ్జెట్ అంశాలపై మాట్లాడుతూ..ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం,అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు,ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం,పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం,రైతులకు జీవనాడి పోలవరం,భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని,ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం,విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం,హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

కొప్పర్తి,ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు,విద్యుత్‌, రోడ్లు,హైవేల అభివృద్ధికి నిధులు,విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు,ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ,రాయలసీమ,ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు,ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు,అలాగే ముద్ర రుణాలు 10లక్షల నుండి 20లక్ష లకి పెంచడం,ఈబడ్జట్ లో మహిళలకీ పెద్ద పిటా వేశారని పేర్కొంటూ.... బడ్జెట్ కేటాయింపులపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ షేక్ సమీవుల్లా, అనంతపురం జిల్లా కిసాన్ మోక్ష అధ్యక్షుడు తిమ్మారెడ్డి, గాండ్లపెంట మండల అధ్యక్షుడు వేమయ్య, ఎంపీ కుంటమండల అధ్యక్షుడు రామ్మోహన్, మైనార్టీ మోక్ష జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు