కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజా బడ్జెట్ - బిజెపి

కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజా బడ్జెట్ - బిజెపి

కదిరి పట్టణంలో కాలేజ్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ కూడలిలో మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు జెట్టి ఆంజనేయులు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.బడ్జెట్ లో రాష్ట్రాభివృద్ధికి , సంక్షేమానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము.ఇల్లు లేని వారికీ కేంద్రం కొత్తగా 3కోట్ల ఇళ్లు.ఇళ్లు లేని వారికి కేంద్రo ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించటం చాలా సంతోషించదగ్గ విషయం.పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేసింది. ఇందుకు గాను బడ్జెట్‌లో అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపింది. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం

అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించటం హర్షణీయం.

ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం

పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపుఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం

భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందిఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం.విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం.హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు.విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌,

రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించటం జరిగింది.

ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ 

బీజేపీ సత్యసాయి జిల్లా తరఫున కేంద్ర ప్రభుత్వానికి ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కి అదేవిధంగా రాష్ట్రా భివృద్ధి కొరకు కేంద్ర పెద్దలతో మాట్లాడి అత్యధిక నిధులు తీసుకోరావటం కోసం విశేష కృషి చేసిన నవ్యాంధ్ర నిర్మాత రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కి అదేవిధంగా మన రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి వర్యులు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కి , బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పూరందేశ్వరి కి,హృదయ పూర్వక ధన్యవాదాలుతెలుపుకుంటున్నాము. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జెట్టి ఆంజనేయులు పట్టణ అధ్యక్షుడు రమేష్, బిజెపి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఇంతియాజ్ బిజెపి నాయకులు శరత్ కుమార్ రెడ్డి,శ్రీనివాసులు చలపతి పవన్ హర్ష రమణ లక్ష్మయ్య హరీష్ బాబు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.