ప్రజల తలరాత మార్చే ఎన్నికలు ఇవి

ప్రజల తలరాత మార్చే ఎన్నికలు ఇవి

ప్రజల తలరాత మార్చే ఎన్నికలు ఇవి

అషా మాషిగా తీసుకోవద్దు

టీడీపి గెలుపే మన లక్ష్యం కావాలి

పుట్టపర్తిలో ఇలాంటి అసమర్థ ఎమ్మెల్యే చరిత్రలో  లేడు.

కార్యకర్తలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె,హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి పిలుపు

ఓడి చెరువు:11

ప్రజల తలరాత మార్చే ఎన్నికలనీ వీటిని అషా మాషి గా తీసుకోవద్దని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి పేర్కొన్నారు.

ఓడి చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ సమావేశంలో వారు మాట్లాడారు. తెదేపా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు. ముందుగా ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని తీవ్రంగా మండిపడ్డారు.

టీడీపీ వస్తేనే అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించారని పేర్కొన్నారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే గ్రామాలే ఖాళీ చేసి పురుగు రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఉంటుందన్నారు అలాంటి పరిస్థితి రాకూడదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బాబు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు గత టిడిపి హయాంలో పెనుగొండ ప్రాంతంలో కి ఎలాంటి పరిశ్రమ రావడం వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు లభించి ఉపాధి దొరికిందన్నారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి  కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ  మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథినీ,పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని వారు అభ్యర్థించారు.

పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎక్కడ చూసినా భూదందాలు, భూ కబ్జాలు పోలీసుల వేధింపులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ప్రజలకు గుర్తు చేశారు. నీ తాటాకు చప్పళ్ళు బెదిరింపులకు టిడిపి కార్యకర్తలు ఎవరు బెదిరిపోరని ఈ ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే పై విరుచుపడ్డారు.

ప్రజలకు సరఫరా అయ్యే త్రాగునీటిని కూడా వదలకుండా తన వ్యవసాయ తోటలకు వాడుకున్న ఘనుడు అని అభివర్ణించారు . నీ పాపాలకు అంతిమ కాలం దగ్గర పడిందని ప్రజలు ఎన్నికల్లో తగిన శాస్తి చెబుతారని హెచ్చరించారు సత్యసాయి త్రాగునీటిని ఎమ్మెల్యే వ్యవసాయ పొలాలకు వాడుకున్నారని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఉన్న అధికారులను కోరారు. మీరు చర్యలు తీసుకొని పక్షంలో ఎన్నికల కమిషన్, లేదా ప్రజా కోర్టులో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దందా పై పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందుకు బాధ్యులైన వారిని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పనవి హెచ్చరించారు. ఈ పాపాలకు అంతం కావాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపనిచ్చారు. ఆలాగే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు అరికట్టాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ వస్తేనే అనేక పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు.ఈ విషయాన్ని ప్రజల వద్దకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీడీపీ గెలుపుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని వారు పేర్కొన్నారు. అనంతరం అమడగూరు మండలం జౌకుల చెందిన 4వైసీపీ కుటుంబాలు,ఒడిచేరువుకు చెందిన బాబ్ జాన్ లు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పార్థసారథి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి టిడిపి నాయకులు జయన్న , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి డాక్టర్ పొగాకు జాకీర్ , ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, పీట్ల సుధాకర్ ,అంజినప్ప తుమ్మల మహబూబ్ బాషా , ఆరిఫ్ ఖాన్ ,నిజాంఖాన్, సర్పంచ్ శంకర్ రెడ్డి ఎంపీటీసీ శ్రీనివాసులు, మాజీ మండల ఉపాధ్యక్షుడు నరసింహ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, కొండే ఈశ్వరయ్య తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి కంచి సురేష్ గంటా శ్రీనివాసులు,నాగేంద్ర ,నాగరాజు, కుమార్ రాయల్ , శ్రీనివాసులు, మీసేవ. సుధాకర్ , అంజనరెడ్డి ,గిరినాథ్ రెడ్డి ,మస్తానమ్మ ,పాలెమ్మ,ఆశాభి ,భాగ్యమ్మ టిడిపి కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.