గుత్తి కోటలో వెలిసి ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడిలో ఆషాడ మాసం సందర్భంగా బోనాల ఉత్సవం జూలై మాసం
గుత్తి కోటలో వెలిసి ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడిలో ఆషాడ మాసం సందర్భంగా బోనాల ఉత్సవం జూలై మాసం
జనచైతన్య న్యూస్- గుత్తి
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం గుత్తి కోటలో వెలసిఉన్న శ్రీ రేణుకఎల్లమ్మ తల్లి గుడిలో ఆషాఢ మాసం సందర్బంగా బోనాల ఉత్సవం జులై మాసం 23 జూలై 2024 వ తేదీ సుమూహూర్తాన జరుగును. కావున భక్తాదులు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మాతకు బోనాలు సమర్పించుకోదలచిన వారు 23 వ తేదీ మంగళ వారం ఉదయం 9 గంటల పైన అమ్మ వారికి సమర్పించుకుని మీ ముక్కులు తీర్చుకోగలరు. పూజ వివరాలు 23 జులై 2024 మంగళవారం బోనాల సందర్బంగా ఉదయం 7 గంటలకు గంగ పూజ, 8 గంటలకు అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం, తదనంతరం కోట వాకిలి నుండి బోనాలు ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించుకోబడును. విన్నపం ఊరేగింపుగా బోనాలు రాక ముందే కొందరు బోనాలు ఉదయమే గుడి వద్దకు తీసుకు వస్తున్నారు, అలా చెయ్యొద్దoడి. అమ్మ వారికి పూజలు చేయక ముందే బోనాలు చెయ్యడం వల్ల అమ్మవారికి బోనం సమర్పించినటు గా ఉండదు.ముందుగా తెచ్చిన బోనాలు ను అమ్మవారు గుడి వద్ద బోనాల ఊరేగింపు తదనంతరం పూజకు తీసుకుంటారు. కనుక అందరూ ఓ క్రమ పద్ధతిలో బోనాలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకోవాలని అందరినీ కోరుచున్నాము. గుత్తి కోట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి భక్త బృందం.