యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల జిల్లా స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్

యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల జిల్లా స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్

యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల జిల్లా స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్

 జనచైతన్య న్యూస్- సత్యసాయి

 సత్య సాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా యుటిఎఫ్ సత్యసాయి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సంబరాల జిల్లా స్థాయి టీచర్స్ టికెట్ టోర్నమెంట్ ఈనెల 13వ తేదీ రెండవ శనివారం నుండి పెనుకొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ప్రారంభం అవుతుందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శెట్టిపి జయచంద్రా రెడ్డి, యం సుధాకర్ లు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం నాడు యూపీఎఫ్ నాయకులతో కలిపి ధర్మవరం పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు కన్వీనర్ గా జిల్లా కార్యదర్శి జి సి నరేష్ కుమార్ వ్యవహరిస్తారని తెలియచేసారు. జిల్లా వ్యాప్తంగా మండల పట్టణ జట్లు పాల్గొంటాయి, కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ఈ టోర్నమెంట్ లో పాల్గొనుటకు అర్హత కలదని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నారాయణస్వామి, రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, రాంప్రసాద్, సకలా చంద్రశేఖర్, సురేష్, హెచ్ రామాంజనేయులు, సాయి గణేష్, వెంకట కిషోర్, వి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.