ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మనది
ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మనది
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
భారత రాజ్యాంగం అత్యంత గొప్పదని, ఇతర దేశాలతో పోలిస్తే మన రాజ్యాంగం అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలను రూపొందించిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నామని మల్లాది విష్ణు అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈసందర్భంగాస్మరించుకోవడం మనందరి బాధ్యతగా చెప్పుకొచ్చారు. పేదరికంలో మగ్గుతున్న వారు, అణగారిన వర్గాలు తమ తలరాతలు తామే రాసుకునే విధంగా, తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఆనాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే నిర్దేశించారో ఆవిధంగా నేడు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారన్నారు. స్వాతంత్య్ర ఫలాలు పేద ప్రజలందరికీ దక్కేలా పాలన సాగిస్తూ మహానీయుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పిస్తున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు చల్లా సుధాకర్, యర్రంశెట్టి అంజిబాబు, అఫ్రోజ్, నేరెళ్ల శివ, ఒగ్గు లీలా ప్రసాద్, అక్బర్, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.