చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: గుమ్మనూరు జయరాం

చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: గుమ్మనూరు జయరాం

*చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: గుమ్మనూరు జయరాం 

 జనం న్యూస్ మే 1 జిల్లా ఇన్చార్జ్....గుంతకల్లు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి  అభ్యర్థి  *గుమ్మనూరు జయరాం* ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంతకల్లు పట్టణం 18, 19, 20 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా *గుమ్మనూరు జయరాం*  వార్డులలో తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కాబట్టి కచ్చితంగా అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా *గుమ్మనూరు జయరాం* ని మరియు ఎంపీగా అంబిక లక్ష్మీనారాయణ ని గెలిపించాలని వార్డు సభ్యులను అభ్యర్థించారు.. ఈ కార్యక్రమంలో  మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్ , ఆయన తనయులు రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి . ఆర్. పవన్ గౌడ్ మరియు యువనాయకుడు . ఆర్. అనిల్ గౌడ్ మరియు గుంతకల్లు పట్టణ మండల టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు..