డిగ్రీ ప్రవేశాలను మాన్యువల్ గా చేపట్టండి ఎస్.కె యూనివర్సిటీ వి సీ గారికి ఎస్ ఎఫ్ ఐ నాయకులు వినతి పత్రం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలు కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ గా చేపట్టాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వీసీ హుస్సేన్ రెడ్డి గారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తరిమెల గిరి, సిద్దు మాట్లాడుతూ! డిగ్రీ ప్రవేశాలు గత ప్రభుత్వం ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడం వల్ల గ్రామీణ విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల తాము కోరుకున్న కాలేజీలో సీటు రాకుండా ఇబ్బంది పడ్డారని అన్నారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ వల్ల దూర ప్రాంతాల్లో సీటు వస్తే అక్కడ హాస్టల్స్ లేక ఇబ్బంది పడ్డారు. కొంతమంది విద్యార్థులు డిగ్రీ చదువును ఆపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందనీ అన్నారు. కొంతమంది విద్యార్థులకు కౌన్సిలింగ్లలో సీట్లు రాక మేనేజ్మెంట్ కోటాలో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదువుకుంటున్నారని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వసతి దీవెన విద్యా దీవెన రాక విద్యార్థులు ఆర్థికంగా నష్టపోయారని అన్నారు. డిగ్రీ ఆన్లైన్ విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలమంది విద్యార్థులు ఆర్థికంగా మానసికంగా నలిగిపోయారని అటువంటి పరిస్థితులు లేకుండా ఈసారి మాన్యువల్ పద్ధతిలోనే డిగ్రీ ప్రవేశాలు నిర్వహించేలా ఉన్నత విద్యా మండలికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ విషయం మీద విసి హుస్సేన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి డిగ్రీ ప్రవేశాలు మాన్యువల్ గా నిర్వహించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని వారి నిర్ణయం ప్రకారమే అడ్మిషన్ నిర్వహిస్తామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మారుతి, గణేష్, సాయికుమార్, వేణుగోపాల్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.