ఆగస్టు 13న చలో హైదరాబాద్, హలో మాదిగ చలో హైదరాబాద్ మాదిగ వైతే రా, కదలిరా
ఆగస్టు 13న చలో హైదరాబాద్, హలో మాదిగ చలో హైదరాబాద్ మాదిగ వైతే రా, కదలిరా
జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం పసులూరు గ్రామంలో పెద్దపప్పూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ ఆధ్వర్యంలో, చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను, ఎమ్మెస్పీ కార్యకర్తలను, అనుబంద సంఘాల కార్యకర్తలను, గ్రామాలు, మండలాలు పర్యటన చేస్తూ ముఖ్య అతిధులు అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ, ఎం ఎస్ పి తాడపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ యం పెద్దిరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ సి బి రవి మాదిగ, మన్య మందకృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా ఉద్యమ పోరాటం వల్ల ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించాం. మాన్య మందకృష్ణ మాదిగ, ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సాధించుకొని ఆగస్టు 13వ తేదీన ఢిల్లీ నుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మాన్య మందకృష్ణ మాదిగ ఘన స్వాగతం పలకడానికి హైదరాబాదుకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం పసులూరు గ్రామం నుండి వాహనాలతో, డప్పు చప్పులతో, కళాకారులతో వాడవాడ పల్లె పల్లె నుండి మాదిగులు పెద్ద ఎత్తున వాహనాలతో తాడిపత్రి నియోజకవర్గం నుండి, అనంతపురం జిల్లా నుండి, ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున వాహనాలతో డప్పు కళాకారులు మహిళలు విద్యార్థులు యువకులు అందరూ కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. 30 సంవత్సరాల మాదిగ దండోరా ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ సాధించాం మాదిగ అమరవీరుల త్యాగాలు 30 సంవత్సరాల నుండి ఎమ్మార్పీఎస్ మాదిగ దండోరా మన్య మందా కృష్ణ మాదిగ, అడుగుజాడల్లో నడుస్తూ పోరాటం చేసిన నాయకులు కుటుంబాలు వదిలి జైలుకు వెళ్లిన పోరాటం చేసి మన్య మంద కృష్ణ మాదిగ ఉద్యమ పోరాటం వల్ల ఎస్సి వర్గీకరణ సాధించాం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, యం పెద్దిరాజు మాదిగ తాడపత్రి నియోజకవర్గ ఎం ఎస్ పి ఇన్చార్జి, సిబి రవి మాదిగ తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మాదిగ దండోరా ఇన్చార్జ్, పసల కంబగిరి మాదిగ పెద్దపప్పూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, పసులూరు గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు, యువ నాయకత్వం పి కంబగిరి స్వామి, రామ్మోహన్, రామాంజనేయులు, ప్రభాకర, సూరి, కృష్ణ, మోహన్, శివయ్య, గ్రామ పెద్దలు గుర్రప్ప, రాజు, లక్ష్మీనారాయణ, వికలాంగుల హక్కుల పోరాట సమితి రామయ్య, పెద్ద కమ్మయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.