ఒక ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
సత్యసాయి జిల్లా.పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళదేవరచెరువు మండల పరిధిలోని చౌడంపల్లి, కొక్కంటివారి పల్లి,గౌనిపల్లి,పగడాలవారిపల్లి, అల్లపల్లి,యర్రబల్లి,ఉగ్గిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇంటి ఇంటికి ప్రచారం విజయవంతంగా పుట్టపర్తి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మయకుంట్ల వెంకటేష్ ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడి ప్రతి ఒక్కరు టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను మీలో ఒక్కడిగా ఆదరించాలని గెలిచినా అనంతరం ప్రతి సమస్యకు పరిస్కారం చూపుతామన్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరు వారి సొంత బిడ్డల ఆదరించారని ప్రతి ఒక్కరు మీకే ఓటు వేస్తామని నా పైన నమ్మకం ఉంచి నాకు మద్దతుగా నిలిచినా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు అన్నారు.ఈ కార్యక్రమం వివిధ గ్రామల ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.