జొన్నల మూటతో శ్రీశైలం పాదయాత్ర

జొన్నల మూటతో శ్రీశైలం పాదయాత్ర

*జొన్నల మూటతో శ్రీశైలం కు పాదయాత్ర..*

*జోగుళాంబ ప్రతినిధి,గట్టు:-* మండుటెండల్లో కాలినడకే కష్టం అనుకుంటున్న తరుణం లో ఓ యువ రైతు తాను రెక్కలు ముక్కలు చేసి పండించిన పంటలోని ఓ మూటను శ్రీశైలం మల్లన్నకు సమర్పించాలని తలచి,ఆ మూటను మోసుకుంటూ శ్రీశైలం బాటపట్టాడు. వివరాల్లో  కెళ్తే కర్ణాటకలొ బీజాపూర్ జిల్లా సిందగీ ప్రాంతానికి చెందిన యువ రైతు 50 కేజీల జొన్నల బస్తాను మెడపై వేసుకొని శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంబించాడు. పాదయాత్ర చేసు చేసుకుంటూ దాదాపు 200 కిలోమీటర్లు నడిచి శనివారం బల్గెర గ్రామం చేరుకున్నాడు మధ్యాహ్నం చెట్టు కింద కాసేపు సేదతిరి మరో రెండు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని జొన్న బస్తాతొ ప్రారంభించి,  తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. కర్ణాటక యువ రైతు భక్తిని చూసి తోటి పాదయాత్రికలతో పాటుగా స్థానుకులు సైతం మెచ్చుకుంటున్నారు.