భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.(పుట్లూరు జనచైతన్య న్యూస్) పుట్లూరు మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామంలో భూ వివాదం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.ఆ గ్రామానికి చెందిన రామక్రిష్ణా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,కుటుంబ సభ్యులు భూ వివాదం విషయంపై ఉండటంతో ఘర్షణ కు పాల్పడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు.అంతేకాకుండా గ్రామల్లో ఎటువంటి సమస్యలు ఉన్న కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలే తప్ప ఎలాంటి ఘర్షణ లకు పాల్పడకూదని ఎస్ఐ హేమాద్రి తెలియజేశారు.