ఎమ్మెల్యే బండారు శ్రావణి కి వినతి పత్రాన్ని సమర్పిస్తున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి చెన్నప్ప యాదవ్

జనచైతన్య న్యూస్- శింగనమల

 అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం శింగనమల మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చెన్నప్ప యాదవ్ రైతన్నలతో కలిసి గురువారం వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నప్ప యాదవ్ మాట్లాడుతూ రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని వెంటనే అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చెన్నప్ప యాదవ్ కోరారు. అదేవిధంగా రైతులు గత ఏడాది అకాల వర్షాలకు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, రైతన్నలను గుర్తించి పంట సాయం అందిస్తే పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.