తిరుపతిలో ఎఫ్ ఆర్ టి ఐ ఘనంగాఅంబేద్కర్ జయంతి వేడుకలు-ఎన్.చంద్రకళ
ఘనంగా ఎఫ్ ఆర్టిఐ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు తిరుపతి ప్రతినిధి ఎన్ చంద్రకళా రెడ్డి.
విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఫోరం ఆర్టిఐ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరం ఆర్టిఐ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళా రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఆర్టి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు అరుణోదయ భాస్కర్ నగర జాయింట్ సెక్రెటరీ మల్లిరెడ్డి జిల్లా కార్యదర్శి ప్రసాద్ స్విమ్స్ కృష్ణమూర్తి మునిరత్నం రాయల్ ముని కిషోర్ శ్రీరాములు ప్రసాద్ ప్రసన్నకుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.