పల్లెల్లో కందికుంటకు బ్రహ్మరథం

పల్లెల్లో కందికుంటకు బ్రహ్మరథం

*శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎన్ పి కుంట*

పల్లెల్లో కందికుంటకు బ్రహ్మరథం 

హుషారు... హుషారుగా ఎన్నికల ప్రచారం 

కదిలిస్తున్న గ్రామీణ ప్రాంత ప్రజలు 

హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తున్న మహిళలు, టిడిపి శ్రేణులు 

నంబులపులకుంట మండలంలోని పి. కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం 

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయామని ఆయా గ్రామస్తులు తీవ్ర ఆవేదన 

కందికుంటను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని భరోసా 

ప్రజల మెచ్చిన నాయకుడు కందికుంట 

కందికుంట తోనే అభివృద్ధి సాధ్యం

 శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట  వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. టిడిపి శ్రేణులతో కలిసి హుషారు హుషారుగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నడంతో ప్రజల సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఎన్ పి కుంట మండల పరిధిలోని పి కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలకు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కర్రపత్రికలను ప్రజలకు అందజేస్తూ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వివరిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయామని ఆయా గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కందికుంటను అఖండ  మెజార్టీతో గెలిపిస్తామని భరోసా కల్పించారు ప్రజల మెచ్చిన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అని కదిరి అభివృద్ధి కందికుంట తోనే సాధ్యమని ఆయా గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అన్ని వర్గాలు జగన్ బాధితులేనని ఆరోపించారు. గంపెడ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. మరోసారి మోసం చేయడానికి ప్రజల్లోకి వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం దివాలా కోరు తీసిందని, అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు  కృషి చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టాల్సిన దుస్థితి నెలకుందన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే బాధ్యత చూసుకుంటానని ఈ సందర్భంగా ఆయన భరోసా కల్పించారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామస్తుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.