74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు – మరుపిళ్ళరాజేష్

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
51వ డివిజన్లో సచివాలయం వద్ద స్టాండింగ్ కమిటీ సభ్యులు 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ మువ్వన్నెల జెండా ఆవిష్కరణ చేసి అనంతరం స్థానిక చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు సచివాలయం సెక్రటరీలు వాలంటీర్లు పాల్గొన్నారు.
తర్వాత చదును మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహ కమిటీ వారు ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని గాంధీ విగ్రహానికి పులామాలవేసి పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో చదును మహాలక్ష్మమ్మ వారి గుడి కమిటీ వారు 51వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.