సి.ఎం. జగన్మోహన్ సంక్షేమ రాజ్యం

సి.ఎం. జగన్మోహన్ సంక్షేమ రాజ్యం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యం

విజయవాడ - జనచైతన్య ( తమ్మిన గంగాధర్ )

ప్రతిఒక్క కుటుంబానికి మంచి జరిగిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 239 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేసి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు చేతగాని పాలనకు, జగనన్న సమర్థ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు. 239 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 5.40 కోట్లు., నాన్ డీబీటీ ద్వారా రూ. 3.37 కోట్లు మొత్తంగా రూ. 8.77 కోట్ల మేలు చేకూర్చినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.