కవి భోగినేని మునీంద్రకు వేమన సాహితీ పురస్కారం
కవి భోగినేని మునీంద్రకు వేమన సాహితీ పురస్కారం
నెంబర్ పూలకుంట-జనచేతన్య న్యూస్
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నెంబర్ పూలకుంట రచయితలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేమన సాహితీ యాత్రలో కటారిపల్లి,తిమ్మమ్మ మర్రిమాను స్థలాలలో జరిగిన సాహితీ కార్యక్రమంలో పాల్గొని కవిత గానం చేసినందుకు గాను రచయిత భీగినేని మునింద్ర కి వేమన సాహితీ పురస్కారం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డికే చదువుల బాబు,జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి జయ చంద్ర,కార్య నిర్వహక సభ్యులు ఉపేంద్రం శంకర్ నారాయణ రాజు చేతుల మీదుగా వేమన సాహితీ పురస్కారం అందుకోవడం జరిగింది. వేమన సాహిత్యం పురస్కారాన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు సాహిత్యానికి సేవ చేస్తానని తెలియజేయడం జరిగింది.