జనసేన పార్టీ పశ్చిమ లో భారీగా చేరిక-పోతిన మహేష్
పశ్చిమ జనసేనలో భారీగా చేరికలు
విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)
ఆర్ఆర్ పేట లో 56 వ డివిజన్ జనసేన నాయకులు లక్ష్మి కాంత్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట లో పశ్చిమ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సమక్షంలో షేక్ గాలిబ్ మిత్రమండలి, షేక్ రఫీ మిత్రమండలి,మర్తి వసంత మిత్రమండలి,ఏడల్లపల్లి రాధ మిత్రమండలి, మరియు K. పద్మావతి, k.కృష్ణవేణి, కే జ్యోతి, షేక్ నజియా, j. కళ్యాణి,b రాణి, దొండపాటి గాయత్రి,గుంటు కనక దుర్గ, 200 మందికి పైగా జనసేనలో చేరడం జరిగింది ఇందులో మహిళలు అధికంగా జాయిన్ అవ్వడం ప్రత్యేకత సంతరించుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని విశ్వసించి జనసేన పార్టీలో చేరుతున్నామన్నారు. పోతిన మహేష్ మాకు అప్పచెప్పే ఏ బాధ్యత నైనా చిత్తశుద్ధితో నిర్వహిస్తామని మహేష్ అనేక సందర్భాల్లో ఆర్ఆర్ పేటలో ఇళ్ల పట్టాల సమస్య గురించి పలుమార్లు ధర్నాలు ఉద్యమాలు నిర్వహించారని, నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి మహేష్ ని మహేష్ లాంటి నాయకులే ఈ సమాజానికి అవసరమని, రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టిడిపి విజయానికి కృషి చేస్తామన్నారు.