సికెల్ సెల్ రక్తహీనత వ్యాధి ప్రాణాంతకం :-
సికెల్ సెల్ రక్తహీనత వ్యాధి ప్రణాంతకం :-
అమడగూరు (జనచైతన్య న్యూస్) జూన్ :- ప్రపంచం సికెల్ రక్తహీనత దినం సందర్బంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వివిధ గ్రామాలలోని గర్భవతులకు ఇతరులకు అవగాహన కల్పించడం జరిగింది వారు మాట్లాడుతూ 2047 నాటికి సికెల్ సెల్ రక్త హీనత వ్యాధిని నిర్ములన కొరకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన దరిమిలా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ సార్వత్రిక నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహించడం ఈ మిషన్ లక్ష్యంగా పేర్కొన్నారు రక్త కణాల సంఖ్య తగ్గడం కళ్ళు పసుపు రంగులోకి మారడం తీవ్ర కీళ్ల, ఒళ్ళు నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం అలసట గర్భధారణ సమయంలో సమస్యలు అవయవ లోపాలు ఈ వ్యాధి లక్షణాలు కాగా జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి చిన్న పిల్లలకు ఈ వ్యాధి ముఖ్యంగా సోకే ప్రమాదం ఉందని తెలిపారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, సత్వర చికిత్స తీసుకోవడం ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ.పీ.యం గోపాల్ ఏఎన్ఎం లు ఆశ వర్కర్స్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.