జనసేన పోతిన మహేష్ పశ్చిమ సీటుకు మద్దతుగా ధర్నా
విజయవాడ వెస్ట్ పై వీడని సస్పెన్స్
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
బీజేపీ నుంచి సుజనాచౌదరి బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం
సీటు కావాలంటూ పట్టుబడుతున్న పోతిన మహేష్ విజయవాడ లోమంఁతిచ వెల్లంపల్లికి పక్కలో బల్లెం లా మారి మంత్రి చేస్తున్న అరాచకాలను అన్యాయాలనుఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎన్నో కేసులను ఎదుర్కొని జనసేనకు అండగా నిలిచి ఒక రోల్ మోడల్ గా నిలిచిన పోతినేని మహేష్
జనసేన పార్టీలో తన సొంత డబ్బును ఎంతో కోల్పోయారు ప్రజలను సమీకరించి ఆ నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు పోతిన మహేష్ ను మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగిన పోతిన మహేష్ హాజరయ్యేవారు. జనసేన పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని అందించారు. అలాంటి వ్యక్తికి సీటు కేటాయించకపోవడం అని దారుణం అని జనసేన వర్గాలు ముక్తకంఠంతో ఆందోళన చేస్తున్నాయి. టిడిపి జనసేన బిజెపి పొత్తు ఎలా ఉన్నా పోతిన మహేష్ కి సీట్ కేటాయిస్తే గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని ఆర్థిక కారణాల రీత్యానో బిజెపికి లొంగిపోయే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే రాబోయే కాలంలో జనసేనకు పుట్టగతులు ఉండవని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి మంచి నేతలు కోల్పోతే రాబోయే కాలంలో జనసేనకు కేడర్ కూడా దొరికే పరిస్థితి ఉండదని పోతిన మహేష్ అంటే ఒక లీడర్ కాదని ఒక శక్తిని మంత్రి వెల్లంపల్లి నే ఎదుర్కొని నిలబడ్డారంటే ప్రజా జీవితంలో ఆయనకి ఎంత అభిమానులు శ్రేయోభిలాషులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చని జనసేన శ్రేణులు తప్పకుండా పోతున్న మహేష్ కి సీటు ఇవ్వాలని గత వారం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. పోతిన మహేష్ సీటు కోసం అర్థించడం తమను చాలా కలిసివేసిందని జనసేన నాయకులువీర మహిళలుఅభిప్రాయపడుతున్నారు.