యూత్ ఆధ్వరంలో సూపర్ సిక్స్ ప్రచారం
పుట్లూరు మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ ప్రచారం.సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల కేంద్రంలో టీడీపీ, బీజేపీ,జనసేన, ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణి యూత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమ కోసం రూపొందించిన సూపర్ సిక్స్ ప్రచారం చేశారు. అనంతరం బిఎస్ఆర్ యూత్ అధ్యక్షుడు వి.రవి మాట్లాడుతూ ఈ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ పథకాల గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి కి గుర్తు సైకిల్ గుర్తు అని తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో వైసిపి ఫ్యాన్ ఆగిపోయేలా ప్రజలు చేస్తారన్నారు . ఇప్పటికైనా టిడిపి అభ్యర్థి బండారు శ్రావణికి ప్రతి ఒక్కరు సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పుట్లూరు బిఎస్ఆర్ యూత్ అధ్యక్షుడు వి. రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు యుత్ అందరూ పాల్గొన్నారు.