*రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న జగనన్నకు మద్దతుగా నిలబడండి
*రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న జగనన్నకు మద్దతుగా నిలబడండి*
* *ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్*
కదిరి రూరల్: రాష్ట్రంలోని నిరుపేదల పిల్లల భవిష్యత్తుతోపాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతూ ఆయనకు అండగా నిలబడాలని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ పేర్కొన్నారు. శుక్రవారం రూరల్ మండలం పరిధిలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ మల్లయ్యగారిపల్లి, మల్లయ్యగారి పల్లి తాండ, కొత్తపల్లి గ్రామాలలో స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
*సంక్షేమ అందుకున్న గ్రామాలలోని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.*
*జగనన్న అందించిన పథకాలతో తామంతా సంతృప్తిగా ఉన్నామని తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని గర్వంగా చెబుతున్నారు.*
*గత ప్రభుత్వంలో కేవలం ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు చెక్కులు ఇచ్చి మోసం చేసిన చరిత్ర బాబుది అయితే ఆసరా పేరుతో అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత జగనన్నది అని మహిళలు చెబుతుండడం విశేషం.*
*మరోసారి జతకట్టి పేదలను మోసం చేయడానికి వస్తున్న అభివృద్ధి నిరోధకులు అయిన మోడి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అవకాశం ఇవ్వద్దండి.*
*నిరుపేదల బతుకులు మారాలన్నా, సంక్షేమం కొనసాగాలన్నా జగనన్నే మళ్ళీ రావాలి.*
*రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.*
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి రాధాకృష్ణ నాయక్, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇన్చార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ లింగాల మధుసూదన్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రకాష్, మాజీ టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ, సర్పంచ్ ఇర్షాద్, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.