జాతీయ చేనేత దినోత్సవ పాల్గొన్న ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్
జాతీయ చేనేత దినోత్సవ పాల్గొన్న ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్
జనచైతన్య న్యూస్- ధర్మవరం
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులు ఉద్దేశించి ప్రసంగించారు, అత్యద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, నేతన్నల సొంతం, రంగు రంగుల దారాలతో అద్భుత కళాఖండాలను రూపొందిస్తూ, ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్న నేతన్నలకు శతకోటి వందనాలు. పట్టువస్త్రాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ధర్మవరం నుంచి వై సత్య కుమార్ ని శాసన సభ్యునిగా ఎన్నిక కావడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తు, ఎంతో ఘన చరిత్ర కలిగి, ధర్మవరం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న నేతన్నలు, గత ఐదేళ్లుగా ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు, చేనేత పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, దీంతో అప్పులపాలైన నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చేనేత రంగం మళ్ళీ కళకళలాడడానికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి విదేశాలకు ఎగుమతి చేసేలా ఈ ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం, చేనేతకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించి నేతన్నల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తాం, అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఇన్చార్జి హరీష్, రాష్ట్ర ప్రధనకార్యదర్శి మురళి నాయుడు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు హసనాపురం చంటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ టీ అంజినేయులు, చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు నగేష్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఉప అధ్యక్షులు జింకా చంద్ర, జిల్లా కార్యదర్శి ఓబులేసు, ఒబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్ర, చేనేత కార్మికులు పాల్గొన్నారు.