సామాజిక న్యాయం గొంతు కోసిన _జగన్మోహన్ రెడ్డి

సామాజిక న్యాయం గొంతు కోసిన _జగన్మోహన్ రెడ్డి

సామాజిక న్యాయం గొంతుకోసిన జగన్మోహన్ రెడ్డి

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య 

సీఎం జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య 

పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల పార్టీ కార్యాలయంలో శనివారం నాడు జయహో బిసి కార్యక్రమములో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీలను రాజకీయంగా పైకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌ ది, చంద్రబాబు దేనని తెలిపారు. బీసీ కులాలకు జగనరెడ్డి వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 ఏళ్లుగా 34శాతం బీసీలకున్న రిజర్వేషన్లను జగన్ అధికారంలోకి వచ్చాక 10శాతం కోత విధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ నాయకులపై దాడులు సైతం జరిగాయి.అన్నికులాలు, వర్గాలకు సమ న్యాయం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. కక్షపూరిత రాజకీయాలతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోది. పార్టీ అధికారంలో రాగానే వెంటనే బీసీలకు రక్షణచట్టం అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ జయహో బిసి పరిశీలకులు వీరంకి వెంకట గురుమూర్తి,చెన్నుబోయిన చిట్టిబాబు,మధుబాబు గార్లు మండల, గ్రామ బిసి అనుబంధ విభాగ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.