వైసీపీ నియంత పాలనకు స్వస్తి పలుకుదాం పల్లె సింధూరమ్మ
వైసీపీ నియంత పాలనకు స్వస్తి పలుకుదాం పల్లె సిందూరమ్మ :
సత్యసాయి జిల్లా ఓడి చెరువు మే (జనచైతన్య న్యూస్) మండలంలోని తంగేడు కుంట పంచాయతీలోని గ్రామాలలో ఎన్.డి.ఏ. కూటమి పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ని గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి అపూర్వ స్వాగతం పలికారు.మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి,ఆమె భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరాలని ఓటర్లను అభ్యర్థించారు ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళినప్పుడు సైకిల్ గుర్తు మాత్రమే కనిపించాలని మీ అమూల్యమైన ఓటును టిడిపికి వేయాలని కోరారు .చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నిజాయితీగా పాలన చేసే పల్లె సింధూర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తొలి మహిళా ఎమ్మెల్యే గా అసెంబ్లీకి పంపించాలని కోరారు. ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేను ఈ ఎన్నికల్లో ఇంటికి పంపాలని తెలిపారు,193 చెరువులను నింపుతానని మాయ మాటలు చెప్పే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాటలు నమ్మవద్దని ప్రజలకు హెచ్చరించారు.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ శెట్టి వారి జయచంద్ర,మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి,జనసేన మండల కన్వీనర్ మేకల ఈశ్వర స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసప్ప చవటకిష్ట, టిడిపి మాజీ కన్వీనర్ రాజారెడ్డి కొండ కుమార్ల మాజీ ఎంపీటీసీ జయమ్మ , చుక్క బైరిశెట్టి నంది నరసింహులు ఎస్ భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ సెల్ నాయకులు మండోజి ఆరిఫ్ ఖాన్ ,పుట్టపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు అఖిల , మస్తానమ్మ,జ్యోతి, బి,లక్ష్మీనారాయణ ఆచారి, దారా నాగేంద్ర,చౌడేపల్లి వెంకట రంగారెడ్డి,బోనాల రామంజి,వాటర్ బాలు కూతల కిష్ట సున్నంపల్లి ఉపసర్పంచ్ నంది ఉత్తప్ప జన సేన, బీజీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.