గవర్నమెంట్ కొలువులో బాధ్యతగా వ్యవహరించిన ఉద్యోగికి సన్మానం
గవర్నమెంట్ ఉద్యోగ విధుల్లో బాధ్యతగా సిన్సియర్గా వ్యవహరించిన కామేశ్వరరావు సన్మానం
కృష్ణాజిల్లా-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
ఎండనక వాననక క్రమశిక్షణతో వృత్తినే దైవంగా భావించి 44 సంవత్సరాలు గవర్నమెట్ కొలువులో పనిచేసినందుకు ఘనసన్మానం. కోసూరు గ్రామం నందు గల ధనికొండ హనుమంతరావు సావిత్రమ్మ దంపతుల ప్రథమ పుత్రుడు ధనుకొండ కామేశ్వరరావు జీవితములొ బాల్యదశలో 7 సంవత్సరాల వయస్సులో విది చేత వంచించబడి రోడ్డుప్రక్క ఆడుకొంటున్న కామేశ్వరరావు పైకి ఏద్దులబండి అకస్మాత్తుగా అదుపుతప్పి వచ్చినందున తప్పించుకొనుటకు వీలులేని విధముగా వెనుకనుండి గుద్దుటచేత ముందుకు పడిపోగా తలపైనుండి బండి చక్రాలు వెళ్లగా చెవులకి, గొంతుకి సంభందించిన నరాలు తెగిపోయాయని వైద్యులు చెప్పిన ప్రకారం వినికిడి,మరియు మాటలు రాక ఎన్నో కష్టాలకోర్చుకొని,యుక్తవయస్సు వచ్చేేవరకు ఎన్నెన్నో హాస్పటల్స్ కి చూపించినా కూడా ఫలితం లేకుండా పోయింది ఐనాకూడా కన్న తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేసి జీవితములో బిడ్డల ఎదుగుదల కోసం తాపత్రయం పడుతున్న సమయములో 1980సవత్సరములొ పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్యాగ్ క్యారియర్గా తాత్కాలికంగా విధులు నిర్వహిస్తూ ప్రతిరోజు కోసూరు నుండి కాజ వరకు కాజ నుండి కోసురు వరకు నడుచుకొంటూ ఉత్తరాలు బ్యాగును తీసుకువెళ్తూ,తీసుకువస్తూ ఏండనకా,వాననకా, తనకి వినపడదని,మాటలు రావని అంగవైకల్యం లోపాన్ని లెక్కచేయకుండా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ కోసూరు మరియు కాజా గ్రామ ప్రజల ఉన్నతాధికారుల సహ ఉద్యోగుల మన్ననలను పొందుతూ ఉద్యోగ విధులను నిర్వహిస్తూ నాగ సత్యవతిని వివాహము చేసుకొని ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చి భర్తగా తండ్రిగా ఉద్యోగస్తుడిగా విధులు నిర్వహిస్తూ మా తండ్రికి ఎనిమిది సంవత్సరముల కిందట మా తల్లి మరణించుటచేత నా తండ్రికి మనోధైర్యాన్ని నింపి నా తండ్రిపై బాధ్యతాయుతంగా ఇటు గృహిణిగా ఆటు తండ్రిపై మమకారంతో నా వంతు సేవలను చేస్తూ,,నాతండ్రికి ఉన్న ఉద్యోగ విధులకు ఆటంకాలు కలిగించకుండా విధులను సక్రమంగా నిర్వహించిన నా తండ్రికి ఈరోజు ఉన్నతాధికారులు సహోదయోగులఅందరూ ఒక్కటిగా కలసీమీఅందరి సమక్షమునందలి పదవీ విరమణ చేయుచున్న నా తండ్రి సేవలను గుర్తించి చేస్తున్న ఈ సన్మాన కార్యక్రమాన్ని,,మీరందరూ నాతండ్రిపై చూపించిన ఆదరణ, ప్రేమమాభిమానాలతో నాతండ్రి పదవీవిరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఉన్నతాధికారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మాకు జన్మనిచ్చినతల్లితండ్రులరుణం ఎన్నీజన్మలెత్తినా వాళ్ళకి సేవచేసినా కూడా తీర్చుకోలేమని భవిష్యత్తులో నా తండ్రికి ఏ విధమైన కష్టము రాకుండా చూసుకుంటామని పెద్ద కుమార్తె మనోహర లక్ష్మి సభాముఖంగా తెలియజేశారు.