గౌనిపల్లి అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వార్షికోత్సవాలు

గౌనిపల్లి అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వార్షికోత్సవాలు

గౌనిపల్లి అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వార్షికోత్సవాలు

 జనచైతన్య న్యూస్- ఓబులదేవర చెరువు

 సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలంలో గోనీపల్లి అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవాలు 2024లో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ్ కుమారి ఆధ్వర్యంలో, తల్లిపాల వార్షికోత్స కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఆంధ్రాలను పూరించి తల్లిపాలు సంస్కృతి చేద్దాం అనే దయతో తల్లిపాలు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు, దీని ప్రకారం పిల్లలకు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించడం మొదట ఆరు నెలల తల్లిపాలు మాత్రమే త్రాగించడం, ఆరు నెలల నిన్న తర్వాత అదరపు పౌష్టికాహారంతో పాటు రెండు సంవత్సరాల తల్లిపాలు కొనసాగించడం చేయాలి. ఇలా జరగని కారణంగా ఏటైదేం లో పిల్లలకు లక్షల మందికి విరోచనాలు, నిమోనియా తో మరణిస్తున్నారు. అన్ని సర్వేలు తెలుపుతున్నాయి, పిల్లలు అనారోగ్య భారను పడకుండా, వయసుకు తగిన బరువు, ఎత్తుతో ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు తాగించడం, మొదట ఆరు నెలల బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం చేయాలి దీనివల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి పెరిగి అలర్జీలు ఇన్ఫెక్షన్ భార్య నా పడకుండా ఉంటారు. తల్లిపాలల్లో విటమిన్లు, ఖనిజాలు , ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, క్రూవులు పుష్కలంగా ఉంటాయి, అంతేకాకుండా తల్లిపాలు త్వరగా జీతం అవుతాయి, దీనివల్ల పిల్లలకు జీర్ణ సమస్యలు రావు. పోతుపాలు పిల్లలకు ప్రాణాంతకం అందువలన ప్రతి తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి, దీన్నే వలన తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి కొన్ని క్యాన్సర్లు రాకుండా ఉంటాయి, తల్లికి బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన గర్భవతులకు, బాలింతలకు, వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త షేమీమ్, ఎంఎల్ హెచ్ పి వసుంధర, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో పాటు గ్రామ గర్భవతులు, బాలింతలు, తల్లులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.