చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరికీ ఉంది, ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి జాతీయ ప్రధాన కార్యదర్శి మనోహర్
చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరికీ ఉంది, ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి జాతీయ ప్రధాన కార్యదర్శి మనోహర్
జనచైతన్య న్యూస్-నిజమాబాద్
నిజామాబాద్ భారత రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందని సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో మానవ హక్కుల శిక్షణ తరగతులు, అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డా. గంప హన్మ గౌడ్, రాష్ట్ర డైరెక్టర్ మాలేపు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ తమ జాతీయ ఛైర్మెన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు తాము మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సమాజంలో వేధింపులు మహిళల పైనే కాకుండా పురుషులు పైన కూడా అధికంగా జరుగుతున్నాయని, ప్రతి డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న పురుషులు కూడా ఎన్నో రకాల వివక్షకు, వేధింపులకు గురి అవుతున్నారని, అలాంటి పిర్యాదులు తమ దగ్గరికి వచ్చే వాటిలో అత్యధికంగా సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలే ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు, అధికారులు వీటి పట్ల పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగంలోని అధికరణం 14 ప్రకారం అందరూ సమానులే అని ఎవరిపైన ఎటువంటి వివక్ష చూపరాదని పేర్కొన్నారు. తమ జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ మానవ హక్కుల పరిరక్షణ కోసం, అనగారిన వర్గాల ప్రజల కోసం ఎంత తపిస్తూ నిరంతరం కష్టపడుతున్నారో తాము కూడా అలాగే నిరంతరం ప్రభుత్వానికి, అధికారులకు సహకారంగా ఉంటూ హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం ఎటువంటి స్వార్థం లేకుండా పని చేస్తున్నామన్నారు. అనంతరం నూతనంగా సభ్యత్వం పొందిన వారికి గుర్తింపు కార్డులు, నియామక పత్రాలను అందచేశారు. అలాగే నిజామాబాదు జిల్లా చైర్మన్ స్థానంలో ఉన్న డా. బి. సుధాకర్ ను, జిల్లా అధ్యక్షులుగా ఉన్న బి. దతద్రి గౌడ్ లను రాష్ట్ర కమిటీ లో తీసుకుంటున్నట్టు నేషనల్ బోర్డు కమిటీ నుండి ప్రకటన వచ్చిందని వారికి ఒక వారంలో అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. దత్తద్రి గౌడ్, బి. సుధాకర్, కొప్పు రాజేందర్, రమా గౌడ్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.