బీసీ కాలనీలో ఘనంగా ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న యువత నాయకులు వి ప్రవీణ్ రెడ్డి
బీసీ కాలనీలో ఘనంగా ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న యువత నాయకులు వి ప్రవీణ్ రెడ్డి
జన చైతన్య న్యూస్- బొల్లారం
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో రేణుక ఎల్లమ్మ ఆలయం,పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి.ఉత్సవాల్లో చివరి రోజున కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ యువజన నాయకుడు ప్రవీణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు.ఈ సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కౌన్సిలర్ గోపాలమ్మ,వెంకటయ్య ని, ఆలయ నిర్వాహకులు,కాలనీ వాసులు అభినందించారు.ప్రతి ఒక్కరు దైవారాధన కలిగి ఉండాలని ప్రవీణ్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కౌన్సిలర్ గోపాలమ్మ ని, నాయకులు ప్రవీణ్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు విశ్వనాథ్,శ్రీను,స్వామి,శేఖర్బీ,రప్ప, భాను,శ్రీనివాస్, వెంకటేష్, కాలనీవాసులు,భక్తులు పాల్గొన్నారు.