ఓబులదేవర చెరువు మండలంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఓబులదేవర చెరువు మండలంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
జనచైతన్య న్యూస్- ఓబులదేవర చెరువు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండలంలోని మండల ఎమ్మార్వో 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మార్వో ఆఫీస్ లో జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరీష్ సీనియర్ నాయకులు సురేష్ పాల్గొని,జాతీయ జెండాను ఎగరవేయడం జరిగినది.సురేష్ మాట్లాడుతూ స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారు,నేడు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు.దేశం పట్ల అందరికీ భక్తి స్వభావం కలిగి ఉండాలని తెలియజేశారు,దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అని ప్రతి ఒక్కరు భారతదేశం లోని కుల మత వర్గాల అతీతంగా ఏదైనా పండగ ఉంది,అంటే అది ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం అని వీరు చెప్పుకొచ్చారు.మన భారతదేశ చరిత్ర ప్రపంచానికి ఈసారి చెప్పాలని తెలియజేశారు,దేశంలోని 140 కోట్ల జనాభాలు కలిసిమెలిసి ఉండాలని,అందరూ ఏకమై దేశ ఖ్యాతిని పెంచాలని సూచించారు.