కార్పొరేషన్ అధికారులకు ఏ ప్రభుత్వమైనా లెక్కలేని తనం

కార్పొరేషన్ అధికారులకు ఏ ప్రభుత్వమైనా  లెక్కలేని తనం

ప్రభుత్వం ఏదైనా - మారని వి.యం.సి - పనితీరు 

నిద్ర వస్తులో పారిశుద్ధ కార్మికులు -పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు

ఎన్‌.టి.ఆర్ జిల్లా -జన చైతన్య కేబుల్ న్యూస్ (రూషిత్ కుమార్)

విజయవాడ :ఏలూరు లాకులు , పాత ఆంధ్రప్రభ ఆఫీస్ ,చాంద్ షాదీఖానా ఎదురు ,మసీదు కమిటీ మీడియాకు ప్రకటించారు .60 దశాబ్దాలుగా ఈ మసీదుకు ఏ రకమైన ఆదాయము లేదు .గట్టిగా వర్షం పడితే ఈ రోడ్డు నిండిపోతుంది .ఈ డ్రైనేజీ నీరు పోవడానికి ఎనిమిది రోజులు పడుతుంది .ఇక్కడ వడ్రంగి పనివాళ్ళు రోడ్డుకు అడ్డంగా మంచాలు వేసుకుని సులభ కాంప్లెక్స్ దగ్గర నిద్రిస్తున్నారు .బైకు వెళ్ళుటకు కూడా దారి లేదు.లేబర్ వర్కర్లు కావడం చేత మేము ఏమి కూడా ఇళ్ళ వారికి  చెప్పలేకపోతున్నాం .ఎన్నో ఏళ్లుగా పారిశుద్ధ కార్మికులు కాన రావడం లేదు . ఎన్నికంప్లైంట్ లైన ఇక్కడ పరిస్థితి మామూలే -మా బాధలు వర్ణతీతం మాకు ఏ దేవుడు ప్రభుత్వం మోక్షం కలిగిస్తుందో 60దశాబ్దాలుగా ఎదురుచూపులు కనీసం కార్పొరేషన్ అధికారులకు మా విన్నపం.