విజయవాడ, వించిపేట స్థానిక సి.ఎస్.ఐ చర్చి కమ్యూనిటీ హాల్ లో చీరల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన ఏపీ డీ జే ఎస్ ఆధ్వర్యంలో కాసాని గణేష్ బాబు అధ్యక్షతన శాంతి సామరస్యసభ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ పాపులర్ షూమార్ట్ గ్రూఫ్ సంస్థల చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ,, సంఘంలోను, గ్రామాలలోను, పట్టణాలలోను, రాష్ట్రాలు, దేశాన్ని, శాంతి సామరస్యంగా ప్రతి ఒక్కరు కోరుతూ జీవించాలని, అలాగే ప్రస్తుత తరుణంలో జరుగుతున్న ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాలు వలన సామాన్యుల ప్రజలు నాశనం అవుతున్నారని, పెద్దలు, చిన్నపిల్లల వరకు వేల మంది ప్రజలు మరణిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్లు, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బోయి సత్యబాబులు మాట్లాడుతూ ప్రతి దేశం సామరస్యంగా జీవించాలని, అందరూ ప్రపంచ శాంతిని కోరుతూ, యుద్ధాలు వద్దు- ప్రపంచ శాంతి ముద్దనీ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడియ, దళిత, దళిత క్రైస్తవ, మైనార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పేటేటి రాజశేఖర్, జనసేన పార్టీ నగర నాయకులు సోమి గోవిందు, టిడిపి అధికార ప్రతినిధి శిరంశెట్టి నాగేంద్ర, స్థానిక సంఘ పెద్దలు పేటేటి రాజమోహన్, మంద నాగేశ్వరరావు, ఏపీడీజీఎస్ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కూర ఝాన్సీ, ముస్లిం మైనార్టీల నాయకులు అబ్దుల్ రజాక్, విద్యార్థి నాయకులు కూర జాన్ బాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, కోశాధికారి అనకాపల్లి కనకరాజు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం స్థానిక పేద మహిళలకు పాపులర్ షూమార్ట్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.