వైసిపి తీర్థం పుచ్చుకున్న బీసీ హక్కుల పోరాట సమితి సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్

వైసిపి తీర్థం పుచ్చుకున్న బీసీ హక్కుల పోరాట సమితి సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్

వైసీపీ తీర్థం పుచ్చుకున్న బీసీ హక్కుల పోరాట సమితి సత్య సాయి జిల్లా అధ్యక్షులు _ ఎమ్మెస్ షబ్బీర్

 ఓ.డి.చెరువు మే:10:(జనచైతన్యన్యూస్) శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలం,ఓడిసి శివాలయం వీధిలో ఉండే ఎమ్మెస్ షబ్బీర్ తన గృహం నందు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తనతోపాటు,తన బీసీ కమిటీ సభ్యులు అయినటువంటి 30 కుటుంబాలు వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తమ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి కూడా జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెస్ షబ్బీర్ మాట్లాడుతూ జగనన్న చేసిన సంక్షేమం,అభివృద్ధికి ఆకర్షితులై నేను నా బీసీ కమిటీ సభ్యులు, వైసీపీ పార్టీలో చేరడం జరిగింది అన్నారు.ఆంధ్రప్రదేశ్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షామీర్ భాష, ఓ.డి.చెరువు టౌన్ కన్వీనర్ కృష్ణారెడ్డి,ఓ.డి.చెరువు మండల కన్వీనర్ రాజు నాయుడు,మార్కెట్ యార్డ్ చైర్మన్ సున్నంపల్లి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు గొల్లపల్లి వెంకట్ రెడ్డి,బాసం వారి పల్లి దేవరాజ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.