విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల విడుదలకు ఎదురుచూపులు

విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల విడుదలకు ఎదురుచూపులు

విశాఖపట్నం కేంద్ర కారాగారం లో సత్ప్రవర్తన ఖైదీల విడుదల

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

విశాఖపట్నం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో సత్ప్రవర్తన గల వారిని ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షతో విడుదల చేస్తారు. కానీ ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఖైదీలకు క్షమాభిక్ష లభించలేదు. కారాగారం అధికారులు 21మంది ఖైదీలకి సంబంధించి ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపారు.  అయితే ప్రభుత్వం నుంచి యెటువంటి అనుమతి రాలేదని కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ తెలిపారు. 2023, ఆగష్టు15న కూడా జాబితా రాలేదు.  శుక్రవారం కూడా విడుదల కాలేదని తెలిసి కారాగారం ఆవరణలో ఖైదీల కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశ చెందారు.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ వారికి క్షమాభిక్ష లభించవచ్చనే ఆశతో ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఖైదీల కుటుంబ సభ్యులు కారాగారం గేటు వద్ద నిరీక్షించారు. జాబితా రాలేదని తెలిసి చాలా మంది కన్నీటి పర్యంతమయ్యారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఖైదీలు విడుదలలో రాజకీయ ప్రజాసంఘాల-హక్కుల సంఘాలనాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి చూపుకరువైపోయింది.ఆలోచన అందగారమైంది.నేటి ప్రభుత్వాలకు పరాకాష్ట.