BSNL భారత టెలి కమ్యూనికేషన్ అడ్వైజర్ డి ఎల్ ఆంజనేయులుకు ఘన సన్మానం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డి ఎల్ ఆంజనేయులు భారతీయ జనతా పార్టీ లో గతంలో 27 సంవత్సరాలుగా పనిచేస్తూ, గతంలో నల్లచెరువు యువమోర్చా అధ్యక్షుడిగా , మండల అధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా, రెండు దఫాలు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి డిఎల్ ఆంజనేయులు కి భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈరోజు టెలి కమ్యూనికేషన్ అడ్వైజర్ ఇవ్వడం అనేది సంతోషకరం. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. డిఎల్ ఆంజనేయులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి నా పదవి రావడానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు GM శేఖర్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే ఎమ్మెస్ పార్థసారధి గారికి , కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారికి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారికి, సీనియర్ నాయకులు ఉత్తమ్ రెడ్డి గారికి,జిల్లా ప్రధాన కార్యదర్శి బూదిలి సుదర్శన్, OBC మోర్చ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో OBC మోర్చ జిల్లా అధ్యక్షులు హసనాపురం చంటి, జిల్లా కార్యదర్శి మేకల నాగార్జున, అశోక్, ఖాదర్, వెంకట రమణ,మైనార్టీ మోర్చ నాయకులు మైనుద్దీన్, ఇంతియాజ్, మాజీ పట్టణ అధ్యక్షులు నందిశెట్టి బాబు, శ్రీనివాసులు, వెంకటేష్ , శ్రావణ్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు