వి.చంద్రారెడ్డి మల్లన్న బస్తిలో నూతన పాఠశాల ప్రారంభం

వి.చంద్రారెడ్డి మల్లన్న బస్తిలో నూతన పాఠశాల ప్రారంభం

విద్యతోనే వికాసం విజయం మున్సిపల్  కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మల్లన్న బస్తిలో నూతన పాఠశాల ప్రారంభం

జన చైతన్య న్యూస్ జిన్నారం ప్రతినిధి ఏర్పుల భాస్కర్

 విద్యతోనే  వికాసం, విజయం దక్కుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న బస్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాగ్దేవి పాఠశాలను చంద్రారెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల బంగారు భవితకు పాఠశాల యాజమాన్యం బాటలు వేయాలన్నారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు జ్ఞాన సంపాదన అందించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలను ప్రారంభించిన కరస్పాండెంట్ ఉదయ్ భాస్కర్ రెడ్డి ని ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం నిర్వాహకులు నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి , స్థానికులు రమణారెడ్డి , నిర్వాహకులు చంద్ర , పాఠశాల యజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు,  తదితరులు పాల్గొన్నారు.