కమనీయంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం
*కమనీయం.. ఖాద్రీశుని కళ్యాణం*
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కన్నుల పండువగా సాగిన ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైనది కళ్యాణోత్సవం కాగా విశేష అలంకరణలో లక్ష్మీనారసింహ స్వామి వారి కళ్యాణం తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు.
*రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు.*
రాత్రి 9:00 గంటల సమయంలో యాగశాల నుంచి నవ వధువులుగా శ్రీదేవి, భూదేవిలతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపం చేరుకున్న లక్ష్మీనారసింహుడు.*
భక్తజన గోవింద నామస్మరణతో పాటు పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారి కల్యాణ విశిష్టతను వివరించిన టీటీడీ అర్చక పండితులు.*
శ్రీవారి కళ్యాణోత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి, రాష్ర్ట సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, తెలుగు, కన్నడ భక్తులు స్వామి అనుగ్రహం పొందడానికి కళ్యాణోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీశుడు నేడు (గురువారం) హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.*