పశ్చిమ సీటు పోతినమహేష్ కి ఇవ్వాలి-కాపు సంఘం
విజయవాడ కాపు, తెలగ ,బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఒంటరి సంఘాల ప్రతినిధులు
విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్)
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ కి పశ్చిమ ఎమ్మెల్యే సీటును కేటాయించాలని పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. పశ్చిమ సీటు ఇస్తే పోతిన మహేష్ ని 25000 మెజారిటీతో గెలిపించి ఇస్తాం కాపు సంఘాలు కాపు సంఘ నాయకులు మాట్లాడుతూ విజయవాడ అతి ముఖ్యమైన ప్రాంతం ఇలాంటి విజయవాడ లో జనసేన ఎమ్మెల్యే సీటు పోతిన మహేష్ కి ఇవ్వాలని,10 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన వ్యక్తి పోతిన మహేష్ అని,పొత్తు ధర్మంగా ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జనసేన పార్టీ పోటీ చేయడం నాయ్యం , కీలకం అని,పవన్ కళ్యాణ్ ని కోరుకునేది ఒకటే అయ్యా పోతిన మహేష్ కి సీటును ఇవ్వండి సీటు గెలిపించి మీకు గిఫ్ట్ గా అందిస్తాంమని, మా కాపు, తెలగ ,బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఒంటరి సంఘాల నాయకులం కలసి పోతిన మహేష్ ని 25000 అఖండ మెజారిటీ తో గెలిపిస్తాంమని అన్నారు, ఈ ఈ విలేకరుల సమావేశంలో కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు ,పోరుమామిళ్ల ఈశ్వర్ ,మైలవరపు కొండలరావు
వీర్ల సూరిబాబు ,సంకబత్తుల సత్యనారాయణ ,పేటేటి నాంచారయ్య, పిల్ల దుర్గాప్రసాద్, బాదర్ల శివ, తోట కోటి, బుద్ధున ప్రసాద్, పాలేటి మోహన్ రావు,రాజేష్ ,రామ నాయుడు తదితరులు పాల్గొన్నారు.