సైకో ముఖ్యమంత్రిని ప్రజలు గద్దె దించాలి-బోండా ఉమా
ఈ సైకోముఖ్యమంత్రిని ప్రజలు గద్దె దించాలి-బోండాఉమా
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
సింగ్ నగర్ లోని టిడిపి సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ 60వ డివిజన్ వాంబేకాలని కు చెందిన బెవర సూరి ఆధ్వర్యంలో 100 మంది టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం జనసేన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వర రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు,సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యి జంపాల సాయికుమార్ , సురేష్, కొండల దుర్గారావు, కొండల నాగరాజు కి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో చదువుకున్న వారికి,కూలి పనులు చేసుకునేవారికి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ నిర్బందానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఇందులో భాగంగా ఈరోజు నాయి బ్రాహ్మణులు సంగం కు చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారని, ఇక ముందు కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీలో ఉంటాయని తెలిపారు. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రిని దించవలసిన అవసరం ఉందని ప్రజలు, ప్రతిపక్షాలు మేధావులు, విద్యార్థులు కలిసికట్టుగా పనిచేయాలని పార్టీలకు అతీతంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం చూస్తుంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పక్కన తాను,ఇంకో పక్కన,మా కుటుంబ సభ్యులు నిత్యం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రతి ఇంటికి వెళ్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రజల అష్టకష్టాలు పడుతున్నారు అని ఇంకొక 45 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా రానున్నది మన ప్రభుత్వం అని వారికి ధైర్యం చెప్పడం జరిగినది అని
ఈ సందర్భంగా ఈరోజు ముందుచూపుతో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన వారికి బోండా ఉమామహేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈకార్యక్రమంలోఎం.మల్లేశ్వరరావు, కంచి దన శేఖర్,ఘంటా కృష్ణమోహన్,బుగత శ్రీరాములు,,బెవర ఆనంద్,కాళ్ళ రాము,బుగత శేఖర్,బెల్లని శ్రీను తదితరులు పాల్గొన్నారు.